పొలిటికల్ ఐ: బాహుబలి ప్రభాస్ 21వ చిత్రం నాగ్ అశ్విన్ ఈ మూవీకి దర్శకుడు. ఈ మూవీ పాన్ వరల్డ్ మూవీ గా తెరకెక్కించనున్నారు. ఇప్పటికే బాలీవుడ్ అందాల భామ దీపికని హీరోయినేగా అనౌన్స్ చేశారు.
ఇప్పుడు ఈ మూవీ లో అమితాబ్ కూడా చేరనున్నారని నాగ్ అశ్విన్ ప్రకటించారు.
ఈ చిత్రానికి ప్రొడక్షన్ హౌస్ అయిన వైజయంతి మూవీస్ ట్విట్టర్లో ఈ ప్రకటన చేసింది. ఇంతకు ముందు చిరంజీవి తెలుగు చిత్రం సైరా నరసింహ రెడ్డిలో భాగమైన అమితాబ్ బచ్చన్, నాగ్ అశ్విన్‌తో కలిసి ప్రభాస్ చిత్రంలో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు.