పొలిటికల్ ఐ సెప్టెంబర్ 18: అక్కినేని ఇంట్లో పెళ్లి బాజా మొగనున్నట్లు సినీ ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తోంది..ఇప్పటికే లాక్డౌన్లో చాలామంది హీరోలు పెళ్లి చేసుకున్నారు. ఇక ఇప్పుడు అక్కినేని ఇంట్లో సన్నాయి సౌండ్ వినిపించనుంది అనే వార్తలు ఫిల్మ్ నగర్ లో చెక్కర్ లు కొడుతున్నాయి.ఐతే ఎవరికి అని అనుకుంటున్నారా? ఇంకెవరు యంగ్ హీరో అఖిల్. ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెను పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటి గాసిప్స్ కామన్ అనుకునేలోపు అక్కినేని కోడలు సమంత బాధ్యతలు వహించనున్నట్లు సమాచారం.అంతేకాదు పెళ్లి విషయంపై ఇరు కుటుంబాలు చర్చించుకున్నట్లు సమాచారం. ఇక అఫిషియల్‌గా అనౌన్స్ చేయడమే ఆలస్యమని తెలుస్తోంది. అఖిల్ పెళ్లి విషయంలో ఇప్పటికే ఒకసారి బోల్తా పడ్డాడు. శ్రేయా భూపాల్‌తో నిశ్చితార్థం అయి ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పరిస్థితులు మారాయి. మరిది పెళ్లి బాధ్యతలు వదిన తీసకున్నదిగా మరేం పర్వాలేదు అన్నీ సవ్యంగా జరుగుతాయి అంటున్నారు అక్కినేని అభిమానులు. అక్కినేని ఫ్యామిలీ పెళ్లి విషయం గురించి చెప్పే వరకు వైట్ చేయాల్సిందే మరి…
Get real time updates directly on you device, subscribe now.
Prev Post
Next Post