రాంగోపాల్ వర్మకు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ హెచ్చరిక..
* దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్వీటర్ లో చేసిన వ్యాఖ్యల పై సంపత్ అభ్యంతరం
* దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ ని ఏమైనా అంటే చూస్తూ ఉరుకొము..
* ఇది మీ మితిమీరిన పోకడకు నిదర్శనం..
పొలిటికల్ ఐ సెప్టెంబర్ 10: దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి కాంట్రావెర్సీ కామెంట్స్ చేశారు..ఈసారి ఏకంగా కాంగ్రెస్ పార్టీ పై నోరు పారేసుకున్నారు.. దీంతో ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ దర్శకుడు రాంగోపాల్ వర్మ పై ఫైర్ అయ్యారు.. రాంగోపాల్ వర్మ ఇటీవలే ఒక సందర్భంలో మాట్లాడుతూ.. బాలీవుడ్ నటి కంగనా సీఎం అవుతుందేమో అంటూ అదే జరిగితే అర్ణబ్ గోస్వామి పీఎం అయిన తర్వాత శివసేన ఉండదు, ముంబై పోలీసులు రిపబ్లిక్ టీవీ రీప్లేస్ చేస్తుంది,కాంగ్రెస్ పార్టీ ఇటలీ కి పరిపోతుందని వ్యాఖ్యానించారు..దీని పై సంపత్ కుమార్ ఘాటుగా స్పందించారు.ఎన్నో పోరాటాలు చేసి దేశనికి స్వాతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ పై అవమానకరంగా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు.
ఇది వర్మ మితిమీరిన పోకడకు నిదర్శనమని ఇలాగే కొనసాగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని సంపత్ కుమార్ హెచ్చరించారు..