Politicla Eye

ప్రతి విషయంలో బీజేపీ-టీఆరెస్ ములాఖత్ అయ్యారు..ఉత్తమ్

పొలిటికల్ ఐ : దేశంలో ప్రధాని నరేంద్రమోదీ ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.రైతులను కేసీఆర్- మోడీ ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. సోమవారం కాంగ్రెస్ నేతలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లు పై రాష్ట్రపతికి గవర్నర్ ద్వారా వినతిపత్రం ఇవ్వాలని రాజభవన్ కు వెళ్ళడానికి ప్రయత్నించారు.ఐతే పర్మిషన్ లేనందున్న పోలీసులు నేతలను అడ్డుకొని గోషామహల్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ కార్యక్రమంలో కి కాంగ్రెస్ ఏఐసీసీ ఇంచార్జి మనిక్కమ్ ఠాగూర్ ,పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి,సిఎల్పీ నేత భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, సీతక్క, పొన్నం, కుసుమ కుమార్, దామోదర్ రాజా నర్సింహా, సంపత్ కుమార్, బోసు రాజు, శ్రీనివాస్ కృష్ణన్, నెరేళ్ల శారద, ఇందిరా శోభన్ తదితరుల పాల్గొన్నారు .ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ … కరోనా కారణం చూపి గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని , సీఎం తో భేటీకి ఎలాంటి కొరొనా అడ్డు రావడం లేదా? అని ప్రశ్నించారు. ఇక పార్లమెంట్ లో ఏకపక్షంగా మూడు బిల్లులను అప్రజాస్వామికంగా బిజెపి పాస్ చేయించిందని వ్యవసాయ బిల్లుల వల్ల వ్యవసాయ రంగం సంక్షోభంలో కురుకుపోతుందని ,బీజేపీ అనుబంధ పార్టీలు వ్యతిరేకించినా బీజేపీ పార్లమెంట్ లో పాస్ చేయించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

బీజేపీ ప్రభుత్వం ప్రైవేట్- కార్పొరేట్ సంస్థలకు తొత్తుగా మారిందని బిల్లులో రైతులకు న్యాయం చేసే- లాభం చేకూరే విదంగా- రక్షణ- హామీ లేదని తెలిపారు .ప్రధాని పార్లమెంట్ బయట మాట్లాడిన మాటలు బిల్లులో లేవని విమర్శించారు.మూడు బిల్లులో రైతులకు ధర భరోసా లేదన్నారు . కార్పొరేట్ సంస్థలకు కావాల్సినంత ఆహార ఉత్పత్తులు చేసుకోవడానికి- ధరలు పెంచడానికి అవకాశం కల్పించారని మండిపడ్డారు.

 

తెలంగాణ రాష్ట్రంలో రైతులకు కేసీఆర్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని, బీజేపీ తెచ్చే ప్రతి ఆర్డినెన్స్-చట్టం-రూల్ కు అనుకూలంగా టీఆరెస్ ఓట్లు వేసిందని విమర్శించారు.ప్రతి విషయంలో బీజేపీ-టీఆరెస్ ములాఖత్ అయ్యారని , రైతు బిల్లుల టీఆరెస్ వ్యతిరేకతలో సిన్సియార్టీ లేదన్నారు. కేసీఆర్ ఆనాలోచిత నిర్ణయాల వల్ల తెలంగాణ లో రైతు ఆత్మహత్యలు ఎక్కువయ్యాయని దేశ చరిత్రలో రైతులకు బేడీలు వేసిన ఘనత కేసీఆర్ కె దక్కిందన్నారు .వర్షాల వల్ల జరిగిన పంట నష్టానికి ఒక్క రూపాయి కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వలేదని కాంగ్రెస్ హయాంలో రైతులకు వడ్డీలేని రుణాలు ఇచ్చిందన్నారు .

 

 

వ్యవసాయ బిల్లుల వెనుక అనేక కుట్రలు ఉన్నాయి

* కార్పొరేట్ సంస్థలకు మాత్రమే కొత్తగా లాభం చేకూరుతుంది

* అక్టోబర్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు

* తెలంగాణ రైతులను కేసీఆర్ మోసం చేస్తున్నారు .

 

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like