పొలిటికల్ ఐ: ఒక డ్రైవర్ ని నటి ముమైత్ ఖాన్ మోసం చేసిందటా..!అదేంటు అనుకుంటున్నారా అసలు విషయానికి వస్తే మూడు రోజులు గోవాకు వెళ్లాలని ముమైత్ మొదట డ్రైవర్ రాజు కారు బుక్ చేసుకుంది. ఆ తర్వాత మూడు రోజులను కాస్త ఎనిమిది రోజుల పాటు పొడిగించిందని డ్రైవర్ చెప్పుకొచ్చాడు.. టోల్ గేట్‌కు, డ్రైవర్ అకామిడేషన్‌కు డబ్బులు కూడా ఇవ్వలేదని రాజు ఆవేదన వ్యక్తం చేసాడు. మొత్తం రూ.15 వేల వరకు ముమైత్ ఇవ్వాలని మీడియా, సోషల్ మీడియాలో రాజు తెలిపాడు. మరో డ్రైవర్‌కు తనలాగా జరగకూడదని రాజు వాపోయాడు. ఈ ఘటనపై క్యాబ్ డ్రైవర్ అసోసియేషన్‌తో కలిసి.. చర్చించిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేస్తానని రాజు చెబుతున్నాడు..
ఆధారాలు కూడా సోషల్ మీడియా లో రాజు పోస్ట్ చేశాడు.. టోల్గేట్ దగ్గర కట్టిన డబ్బులు తాలూకు రిసిప్ట్స్, ముమైత్‌తో కలిసిన దిగిన ఫొటోలు, ఆమెతో చేసిన వాట్సాప్ చాట్‌ను రాజు షేర్ చేశాడు. ముమైత్ తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.