ముంబై: క్రికెట్ రథసారధి విరాట్ కోహ్లీ కుటుంబానికి సంబంధించి అభిమానులకు శుభవార్త చెప్పాడు. త్వరలో తన భార్య, నటి అనుష్క శర్మ బిడ్డకు జన్మనివ్వనున్నదని ఆయన వెల్లడించాడు.
ఇప్పుడు ఇద్దరం, ఇక నుంచి ముగ్గురం కాబోతున్నట్లు ఆనందం వ్యక్తం చేశాడు. జనవరి 2021 లో మా కుటుంబంలోకి మరొకరు వస్తున్నారని విరాట్ ట్వీట్ చేశాడు. 2017 లో నటి అనుష్క శర్మను విరాట్ వివాహం చేసుకున్నాడు.