Politicla Eye

ఆ రెండు ఎంట్రన్స్ లు వాయిదా వేయాలి: సోనూసూద్

ముంబై: సెప్టెంబర్ 1వ తేదీ, 14వ తేదీ నుంచి ప్రారంభమయ్యే జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షలు వాయిదా వేయాలని నటుడు సోనూ సూద్ డిమాండ్ చేశారు. ఈ రెండు ప్రవేశ పరీక్షలను మరో రెండు నెలలు వాయిదా వేయాలని ఆయన కోరారు.

బిహార్ లోని 13 జిల్లాల్లో వరదల ప్రభావం తీవ్రంగా ఉందని, వారి వద్ద డబ్బులు కూడా లేవన్నారు. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఎలా వెళ్తారని ఆయన ప్రశ్నించారు. ఒత్తిడి లేని సమయంలో పరీక్షలు నిర్వహించాలని సోను సూద్ కేంద్రాన్ని కోరారు. మరో రెండు నెలల పాటు వాయిదా వేస్తే, అప్పటికి కరోనా మహమ్మారి కూడా కొంత తగ్గుముఖం పట్టవచ్చని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like