ముంబై: ప్రేక్షకులను కనువిందు చేసే బిగ్ బాస్ హిందీ 14వ షో కళ్లలో వత్తులు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని అనుకుంటున్న షో ను వీక్షించేందుకు అందరూ సిద్ధమయ్యారు.
వారి ఆశలు కార్యరూపంలోకి వచ్చే అవకాశాలు ఆలస్యమయ్యే సూచనలు ఉన్నాయి. కనీసం నెల రోజుల పాటు వాయిదా పడే సూచనలు కన్పిస్తున్నాయి. ముంబై లో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో బిగ్ బాస్ హౌస్ సెట్ ఇంకా పూర్తి కాలేదు. వర్షాల కారణంగా ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ఇంటి నిర్మాణం, హౌస్, ఇంకా కొన్ని సెట్ల పనుల పెండింగ్ లో ఉన్నాయి.
బిగ్ బాస్ షో ప్రారంభానికి వారం రోజుల ముందు నుంచే కంటెస్టెంట్లను క్వారంటైన్ కు తరలించనున్నారు. క్వారంటైన్ ముగిసిన తరువాతే వారికి మరోసారి పరీక్షలు నిర్వహించి, నెగెటివ్ వస్తేనే షో లోనికి అనుమతించనున్నారు.