Politicla Eye

డాలర్ బాయ్ లీలలు అన్నీ ఇన్నీ కావు…

హైదరాబాద్: పంజగుట్ట పోలీసు స్టేషన్ లో తనపై 146 మంది అత్యాచారం చేశారని చెబుతున్న మహిళ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న డాలర్ బాయ్ అలియాస్ రాజశేఖర్ రెడ్డి వెలుగులోకి వస్తున్నాయి.
తన వద్దకు 2018 లోఉద్యోగం కోసం వచ్చిన అనంతపురం యువతిని డాలర్ బాయ్ ట్రాప్ చేశాడు. ఒరిజినల్ సర్టిఫికేట్ తన దగ్గర పెట్టుకొని, ప్రేమ పేరుతో వెంటపడ్డాడు. డాలర్ బాయ్ మాయమాటలకు పడిపోయిన యువతి 2018 డిసెంబర్ లో పెళ్లి చేసుకుంది. పెళ్లైన తర్వాత డాలర్ బాయ్ విశ్వరూపం తెలిసిన సదరు యువతి షాక్ గురైంది. నిత్యం మానసికంగా, శారీరకంగా వేధిస్తూ సైకో ఆనందం పొందేవాడు. డాలర్ బాయ్ డబ్బులు, బంగారం తేవాలంటూ చిత్రహింసలకు గురి చేసేవాడు. తనని విడిచి వెళ్లి పోతే ఒరిజినల్ సర్టిఫికేట్లు ఇవ్వనని యువతితో బెదిరింపులకు దిగేవాడు.

ప్రేమ పేరుతో పెళ్లి చేసుకొని చిత్రహింసలకు గురి చేస్తున్నాడని హైదరాబాద్ సీసీఎస్ పోలీస్ స్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు 4 నెలల క్రితం కేసు నమోదు చేశాడు. కన్సల్టెన్సీ యాడ్ ఏజెన్సీ పేరుతో పలువురికి ఉద్యోగాల ఆశ చూపి వారి సర్టిఫికెట్లను తన వద్ద పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తు చేసే కొద్దీ డాలర్ బాయ్ మోసాల చిట్టా బయట పడుతుండడంతో పోలీసులే షాక్ గురవుతున్నారు.

డాలర్ బాయ్ బాధితులు ఇంకెంత మంది ఉంటారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. భార్య ఫిర్యాదు మేరకు డాలర్ బాయ్ పై చర్యలకు రంగం సిద్ధం చేసిన పోలీసులు. పంజాగుట్ట పోలీసు స్టేషన్ లో తనపై ఎంతోమంది అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసిన మహిళ, రాజశేఖర్ రెడ్డి అలియాస్ డాలర్ బాయ్ ట్రాప్ లో పడి ఉంటుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like