హైదరాబాద్: తనపై 139 అత్యాచారం చేశారని పెట్టిన కేసును పంజాగుట్ట పోలీసులు సీసీఎస్ కి బదిలీ చేశారు. ఈ కేసును సీసీఎస్ పోలీసులు విచారించనున్నారు.
139 మంది తన పై అత్యాచారం చేశారని ఒక బాధిత మహిళ పంజగుట్ట పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఇంత మంది అత్యాచారం చేశారని ఆరోపణలు చేయడంతో ఏం చేయాలనే దానిపై పోలీసులు తలలు బద్దలు కొట్టుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు లోతైన దర్యాప్తు కోసం కేసును సీసీఎస్ కి బదిలీ చేశారు.
ఒకవేళ సీసీఎస్ అధికారులు విచారణ కు ముందుకు రాకపోతే ప్రభుత్వ ఆదేశం మేరకు సీఐడీకి అప్పగించనున్నట్లు సమాచారం.