కర్నూలు: శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రస్తుతం 1.48 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. గత కొన్ని రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో క్రమంగా వరద కూడా తగ్గిపోయింది.
దీంతో శ్రీశైలం రెండు గేట్లను ఎత్తి దిగువకు 86,560 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.80 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 215.80 టీఎంసీలు ఉంది.