Politicla Eye

రేపు మహాప్రస్థానంలో సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు

సూపర్ స్టార్ కృష్ణ 79 ఏళ్ల వయసులో కన్నుమూసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో అభిమానులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. మరోవైపు, ఆయన అంత్యక్రియలను రేపు నిర్వహించనున్నారు. అంత్యక్రియలు ఎల్లుండి జరుగుతాయని తొలుత వార్తలు వచ్చాయి. అయితే ఈ అంశంపై కుటుంబ సభ్యులు క్లారిటీ ఇచ్చారు.

కాసేపటి క్రితమే కృష్ణ పార్థివదేహాన్ని కాంటినెంటల్ ఆసుపత్రి నుంచి నానక్ రామ్ గూడలోని ఇంటికి తరలించారు. సాయంత్రం 5 గంటలకు భౌతికకాయాన్ని గచ్చిబౌలి స్టేడియంకు తరలిస్తారు. ప్రజల సందర్శనార్థం రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు అక్కడే ఉంచుతారు. ఆ తర్వాత అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like